PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

12 మందికి ఉరిశిక్ష..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఒంగోలు కోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. జాతీయ ర‌హ‌దారి మీద హ‌త్య కేసుల్లో కీల‌క నిందితుడు మున్నా అలియాస్ అబ్దుల్ స‌మ్మద్ తో పాటు మరో 11 మందికి ఒంగోలు 8వ అద‌న‌పు సెష‌న్స్ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. మ‌రో ఏడుగురికి యావ‌జ్జీవ కారాగార శిక్ష విధించింది. అప్పటి కోల్ క‌త‌- చెన్నై 16వ జాతీయ ర‌హ‌దారి మీద కొన్ని లారీలు, డ్రైవ‌ర్లు, స‌రుకులు అదృశ్యం అయిన కేసుల్లో మున్నా హ‌స్తం ఉన్నట్టు నిర్దార‌ణ అయింది. ఈమేర‌కు కోర్టు హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ కు ఉరిశిక్ష ఖ‌రారు చేసింది. 13 ఏళ్ల క్రితం జాతీయ ర‌హ‌దారి మీద లారీల అదృశ్యం కేసుల్లో పోలీసులకు ఎలాంటి క్లూ దొర‌క‌లేదు. అప్పటి శిక్షణ డీఎస్పీ దామోద‌ర్ కు అందిన క్లూ ద్వార ఇన్వెస్టిగేష‌న్ చేశారు. ఇన్వెస్టిగేష‌న్ లో విస్తుపోయే నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. మున్నా జాతీయ ర‌హ‌దారి మీద వెళ్లే వాహ‌నాల‌ను ఒక అధికారిగా ఆపి.. లారీ లైసెన్సులు చెక్ చేస్తూ.. డ్రైవ‌ర్లను తాడుతో గొంతు బిగించి చంపాడు. అనంత‌రం లారీల‌ను ఓ పాడుబ‌డ్డ బంగ్లాకు తీసుకెళ్లి.. లారీల‌ను తుక్కు చేసి అమ్మాడు. స‌రుకుల‌ను కూడ అమ్మాడు. డ్రైవ‌ర్ల మృత‌దేహాలను స‌మీపంలోని అడవుల్లో గోతులు తీసి పాతేసేవాడు. అలా జాతీయ ర‌హ‌దారిలో 13 మందిని హ‌త్య చేసిన‌ట్టు విచార‌ణ‌లో తేలింది.

About Author