NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉరితీస్తా.. ఉద్యోగుల‌పై కలెక్ట‌ర్ సీరియ‌స్ !

1 min read
ప‌ల్లెవెలుగువెబ్:విధులు స‌రిగా నిర్వ‌హించ‌కుంటే ఉరితీస్తానంటూ ఓ క‌లెక్ట‌ర్ ఉద్యోగుల‌పై మండిప‌డ్డారు. ఈ ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని గ్వాలియ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ విక్ర‌మ్ సింగ్ వ్యాక్సినేష‌న్ డ్రైవ్ స‌రిగా నిర్వ‌హించ‌డం లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఒక్క‌రోజు కూడ ఆల‌స్యం కాకూడ‌ద‌ని, అలా చేస్తే ఉరితీస్తానంటూ ఉద్యోగుల‌ను హెచ్చ‌రించారు. వ్యాక్సినేష‌న్ తీసుకోకుండా ఎవ‌రూ ఉండ‌కూడ‌ద‌ని, ప్ర‌జ‌ల ఇళ్ల వ‌ద్ద‌కు, పంట‌పొలాల వ‌ద్ద‌కు వెళ్లి అభ్య‌ర్థించాలంటూ సూచించారు. ఏదైనా చేయండి కానీ వ్యాక్సినేష‌న్ మాత్రం పూర్తీ కావాలంటూ స్ప‌ష్టం చేశారు. ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్ గా మారింది. 

                 

About Author