వ్యాయామం… అందరికీ అవసరం… : జి. రాఘవరెడ్డి
1 min readకర్నూలు జి.పుల్లారెడ్డి భవన్ లో “శ్రీ హనుమాన్ వ్యాయామశాల ప్రారంభం”
పల్లెవెలుగు వెబ్: కర్నూల్ రెవెన్యూకాలనీ లోని జి.పుల్లారెడ్డి భవన్ లో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ హనుమాన్ వ్యాయామశాలను జి.పుల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జి. రాఘవరెడ్డి, శ్రీ బాల సాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ టి. రామారావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జి. రాఘవ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాయామం అవసరమని, యువకులు క్రమశిక్షణతో ప్రతిరోజు సూర్య నమస్కారాలు, వ్యాయామము, కర్ర సాము, హనుమాన్ చాలీసా పారాయణం తప్పనిసరిగా చేయాలని, ఆరోగ్యవంతంగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆ తరువాత టి .రామారావు మాట్లాడుతూ భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించే సేవా కార్యక్రమాలకు భగవాన్ శ్రీ బాల సాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ నుండి సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ టి.ప్రతాపరెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హిందూ యువకుల కొరకు వ్యాయామశాలలను ఏర్పాటు చేస్తున్నారని, ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అన్ని నగరాలలో, పట్టణ కేంద్రాలలో, మండల కేంద్రాలలో వ్యాయామశాలలను ఏర్పాటు చేసి యువకులలో క్రమశిక్షణతో కూడిన వ్యాయామము, సూర్య నమస్కారాలు, యోగ ఆసనాలు, కర్ర సాము ఇతర సాహస క్రీడలలో శిక్షణ ఇచ్చి యువకులకు దేశభక్తిని పెంపొందించేలా బజరంగ్ దళ్ కృషి చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నంది రెడ్డి సాయి రెడ్డి, లలిత పీఠం వ్యవస్థాపకులు సుబ్బిస్వామి, విశ్వహిందూ పరిషత్ నాయకులు సాధు శ్రీనివాస్ రెడ్డి, ఎస్. ప్రానేష్, సందడి మహేశ్వర్, వై. ఎన్. శంకర్ రెడ్డి, ఏ వి ప్రసాద్, గూడా సుబ్రహ్మణ్యం, బిజెపి రాష్ట్ర నాయకులు కే.హరీష్ బాబు , బి.వి సుబ్బారెడ్డి,విజయుడు, శివ, నీలి నరసింహ, భాను ప్రకాష్, రాజేష్, సాంబ శివారెడ్డి, నాగరాజు, అయోధ్యా శ్రీనివాస్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, సాయి, రాము, భగీరథ, నవీన్ లు మరియు వివిధ ధార్మిక, సామాజిక సంఘాల, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.