PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ్యాయామం మన మంచికే..

1 min read

– అంతర్జాతీయ ఫిజియోథెరపీ దినోత్సవం

– సెప్టెంబర్ 8న డాక్టర్. శ్రీలత కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్

కిమ్స్ సవీ, అనంతపురం

పల్లెవెలుగు వెబ్ అనంతపురం: మనిషికి ఆహారంతో పాటు వ్యాయామం కూడా అతిముఖ్యమైనది. నిత్య జీవన శైలిలో అతి ప్రధానమైన ఈ వ్యాయాయంపై ప్రజల్లో సరైన అవగాహాన లేకుండా పోతోంది. ఇందు కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన అంతర్జాతీయ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం రిహబిలిటేషన్ & లాంగ్ కోవిడ్ అనే థీమ్తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ రోజున ప్రజల్లో వ్యాయామంపై మరింత అవగాహాన పెంచడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.ప్రపంచంలో మీరు ఏ దేశంలో ఉన్నా.. ఫిజియోథెరపిస్టులు సహాయం చేస్తూనే ఉంటారు. రోగులు మరియు అథ్లెట్ల రోజువారీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఫిజియోథెరపీల సహాయం  లేకుండా ముందుకు వెళ్లడం కష్టమనే చెప్పుకోవాలి. ముఖ్యండా క్రీడా కారుల విషయంలో ఫిజియోథెరపీలు కీలక ప్రాత పోషిస్తారు.శరీరంలో ఎక్కడైన చికిత్సలు జరిగినప్పుడు ఆయా నొప్పులకు తగ్గించడానికి, కదికలను యాధవిధిగా చేయడానికి ఫిజియోథెరపీ సహాయం చాలా అవసరమవుతుంది. అలాగే దీర్ఘకాలిక మందుల వాడకాన్ని తగ్గించడానికి సమర్థవంతంగా సహాయపడవచ్చు.వివిధ కారణాల చాలా మంది ఇంటికే పరిమితయ్యారు. ఇంకా కొంత మంది ఇంటి నుంచే పనులు చేయడం ప్రారంభించారు. దీంతో అనేక రకాలైన సమస్యలు వస్తున్నాయి. ప్రధానంగా లౌక్ డౌన్ సమయంలో అత్యవసర సర్వీసులు తప్పా ఆసుపత్రుల సేవల కూడా అందుబాటులో లేకుండా పోయాయి. దీనివల్ల ప్రజలు మరింత ఇబ్బందులు గురయ్యారు. ఈ సంవత్సరం ఆన్ లైన్ మాధ్యమాల ద్వారా ఫిజియోథెరపీని పంపిణీ చేయడంపై దృష్టి పెడుతుంది. ఫిజియోథెరపీ అనేది సైన్స్ రంగం. ఇది అస్థిరత, కండరాల బలహీనత, న్యూరోలాజికల్ బలహీనతలు మరియు శారీరక రుగ్మతలకు సంబంధించినది. ఫిజియోథెరపిస్టులు రోగులు త్వరగా కోలుకోవడానికి వివిధ రకలైన వ్యాయామాలు సూచిస్తారు. గాయాలు మానడానికి దానీ తీవ్రతమ మీద ఆధారపడి ఉండవ్చు. ఫిజియోథెరపీ అనేది ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ట్రైనింగ్లో అత్యంత అవసరం ఇక్కడ అథ్లెట్లు తమ శిక్షణలో ప్రతి రోజు వారి సహాయాన్ని తీసుకుంటారు.

About Author