NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వ్యాయమం.. అవసరం.. : మేయర్​ రామయ్య

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరికి జిమ్, వ్యాయామం లాంటివి ఎంతో అవసరం    అన్నారు నగర మేయర్​ బీవై రామయ్య, కర్నూలు ఎమ్మెల్యే ఎం.ఎ.హఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి.  సోమవారం నగరంలోని బుధవారపేట, సిండికేట్ బ్యాంక్ ప్రాంతంలో ఫిట్ నెస్ ఎస్ బి ఎం హబ్ ను ప్రారంభించారు.  కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన కర్నూలు ఎమ్మెల్యే ఎం.ఎ.హఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి,కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు.

మనిషి ఎంత కష్టపడిన ఆరోగ్యం ఎంతో ముఖ్యం అన్నారు. యువత ఉద్యోగాలు పొందేందుకు వ్యాయామం, జిమ్ ఎంతో ఉపయోగపడతాయని వారు తెలిపారు. అత్యధిక పరికరాలు అయినటువంటి త్రెడ్ మిల్స్, ఇల్లిప్టికల్స్, స్పిన్ బైక్స్, ఇంపోర్టెడ్ జిమ్ ఈకిక్మెంట్, రూమ్ బైసెప్ కరల్, లాట్ పుల్ డౌన్, లెగ్ కరల్, లెగ్ ఎక్స్టెన్షన్, కెప్టెన్ అమెరికా డబుల్, కెప్టెన్ అమెరికా డంబుల్స్ లాంటి అనేక రకాల పరికరాలతో యువకులకు, మహిళలకు, పురుషులకు కర్నూల్ లో అతి తక్కువ ధరలకే నెలసరి రోజువారీ గా ఫిట్నెస్ హబ్బులో చేరవచ్చని ప్రొప్రైటర్ మధు కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బంగి అనంతయ్య, హనుమంత్ రెడ్డి, 15వ వార్డు సమన్వయకర్త కేదార్ నాథ్, కో ఆప్షన్ నెంబర్ శ్రీరాములు, నయీమ్ పాషా, వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author