NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వెన్నెల పాఠశాల విద్యార్థుల విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమం

1 min read

కన్నుల పండగ సాగిన సైన్స్ ఫెర్.

పాఠశాల మేనేజ్మెంట్ కు ప్రశంసల పరంపర.

పల్లెవెలుగు వెబ్ కమలాపురం: ఫిబ్రవరి 29 విద్యార్థుల్లోని విజ్ఞానాన్ని వెలికి తీసేందుకు ఉత్తమమైనటువంటి మార్గమే సైన్స్ ఫెర్ కార్యక్రమo అని కమలాపురం వైద్యాధికారి షాకీర్ హుస్సేన్, ఇతర ప్రభుత్వ టీచర్లు అన్నారు. రెండవ రోజు కమలాపురం లోని వెన్నెల ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులు తోటి సైన్స్ వేర్ కార్యక్రమంలో నిర్వహించారు ఈ సైన్స్ ఫెర్ కార్యక్రమం లో విద్యార్థులు. నిన్నటి కంటే రెట్టింపు ఉత్సాహంతో కాకుండా పాల్గొన్నారుఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమలాపురం వైద్యశాఖ అధికారి డాక్టర్ షాకీర్ హుస్సేన్,విచ్చేశారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, వేద స్కూల్ విద్యార్థుల ఉపాధ్యాయులు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెన్నెల ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటుచేసినవిజ్ఞాన ప్రదర్శన కార్యక్రమాన్ని తిలకించారు. అనంతరం అతిధులు మాట్లాడుతూ చిన్నపిల్లలో విద్యార్థి దశనుంచే సృజనాత్మక ఆలోచనలను వెలికి తీయడానికి సైన్స్ ఫేర్ను ప్రభుత్వం ప్రతి సంవత్సరం పాఠశాల లో నిర్వహించడం ఎంతో అభినందించ దగ్గ విషయం అన్నారు.పాఠశాల హెడ్ మాస్టర్ ఎ.మాధవీ, కరస్పాండెంట్ అప్పాజీ ప్రవీణ్ 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకూ పిల్లలచేత పలు విషయాలపై విజ్ఞానం ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిం చారు. వెన్నెల పాఠశాల అనతి కాలంలోనే పెద్ద పాఠశాలలకు దీటుగా తయారవుతుందంటే దీనిలో కరస్పాండెంట్ ప్రవీణ్ అప్పాజీ,ప్రధానోపాధ్యాయురాలు ఎం. మాధవి కృషి ఎంతో ఉందని సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి విచ్చేసిన విద్యావంతులు, తల్లిదండ్రులు.ఆన్నారు. ఈ కార్యక్రమములో విద్యార్థుల తల్లి దండ్రులు, పలువురు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

About Author