NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తిరుప‌తి ఫ‌లితం పై ఎగ్జిట్ పోల్స్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్, తిరుపతి : తిరుప‌తి ఉపఎన్నిక‌కు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విడుద‌ల అయ్యాయి. మే 2న తిరుప‌తి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జ‌ర‌గనుంది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నిక‌లు పూర్తయిన నేప‌థ్యంలో ఎగ్జిట్ పోల్స్ వ‌చ్చేశాయి. ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం తిరుప‌తి ఉప ఎన్నిక ఎన్నడూ లేని వినూత్న రీతిలో జ‌రిగింది. అధికార పార్టీ రిగ్గింగ్ చేసింద‌ని ప్రతిప‌క్షాలు ఆరోపించాయి. ఈనేప‌థ్యంలో తిరుప‌తి ఉప ఎన్నిక ఫ‌లితాల‌కు ముందే.. ఎగ్జిట్ పోల్స్ మీద కూడ ఆస‌క్తి నెల‌కొంది. ఆత్మసాక్షి, ఆరా అనే రెండు స‌ర్వే సంస్థలు తిరుప‌తి ఉప ఎన్నిక మీద స‌ర్వే నిర్వహించాయి. ఆ స‌ర్వే ఫ‌లితాలు ఇలా ఉన్నాయి.
ఆత్మసాక్షి స‌ర్వే:
వైసీపి – 6.6 నుంచి 7 ల‌క్షల ఓట్లు
టీడీపీ – 3.5 ల‌క్షల ఓట్లు
బీజేపీ- 85 నుంచి 87 వేల ఓట్లు
కాంగ్రెస్ – 16 వేల నుంచి 17 వేల ఓట్లు
ఇత‌రులు- 6100 ఓట్లు
ఆరా స‌ర్వే:
వైసీపీ- 65.85 శాతం ఓట్లు
టీడీపీ- 23.10 శాతం
బీజేపీ- 7.34 శాతం
ఇత‌రులు- 3.71 శాతం

About Author