గ్రామంలో విస్తరిస్తున్న బెల్ట్ షాపులు..!
1 min read– పట్టించుకోని ఎక్సైజ్ , పోలీస్ శాఖ అధికారులు
పల్లెవెలుగు, వెబ్ రుద్రవరం: మండలంలోని చందలూరు గ్రామంలో బెల్ట్ షాపులు విస్తరిస్తున్నా బెల్ట్ షాపులను అరికట్టాల్సిన ఎక్సైజ్ , పోలీస్ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని మహిళలు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పలు ప్రదేశాలలో నలుగురు వ్యక్తులు పోటా పోటీగా బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయిస్తున్నట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. గ్రామంలో సాయంత్రం నుండి పొద్దుపోయే వరకు బెల్ట్ షాపులలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని మందుబాబులు ఇష్టానుసారంగా మద్యం సేవించి గ్రామంలో సమస్యలకు ఘర్షణలకు పాల్పడుతున్నారని దీంతో తీవ్ర ఆందోళన గురవుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. గత రెండు రోజుల క్రితం గ్రామంలో మందుబాబులు మద్యం మత్తులో ఘర్షణకు పాల్పడ్డారని దీంతో ఏవైనా అనుకోని సంఘటనలు చోటు చేసుకునే ప్రమాదం నెలకొంటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో మద్యం విక్రయించకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.