PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మన బడి నాడు-నేడు నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయండి

1 min read

– అనుమతులు మంజూరు చేసిన వాటిని తప్ప ఇతర నిర్మాణాలు చేపట్టితే చర్యలు తప్పవు : జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : మన బడి నాడు-నేడు ఫేజ్-2 నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ మంజూరు చేసిన వాటికి తప్ప అనుమతి లేని నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన సంబంధిత అధికారులను హెచ్చరించారు.గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నాడు-నేడు ఫేజ్-2 పనుల పురోగతి, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారుఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలో రూపు రేఖలు మార్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మన బడి నాడు-నేడు ఫేజ్-2 ద్వారా రూ.22కోట్ల 61 లక్షలు సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలకు మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఎక్స్పెండిచర్ కు సంబంధించి 87 శాతం ఉండగా, హోళగుంద, కౌతళం, నందవరం మండలాల్లో తక్కువ శాతం ఎక్స్పెండిచర్ నమోదయిందన్నారు. ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీల వారీగా సమగ్ర శిక్ష వారు 41 పాఠశాలకు 4కోట్ల 61 లక్షలు మాత్రమే ఖర్చు చేశారన్నారు. పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం మొత్తం స్పెల్-1 క్రింద 1312 అదనపు తరగతి గదులు మంజూరు కాగా వాటిలో 14 పాఠశాలలలోని 104 అదనపు తరగతి గదులకు గాను ఇంకా 31 మొదలు కాలేదని ఆగస్టు 31వ తేది నాటికి పూర్తి చేయాల్సి ఉండగా ఇంకా ఎందుకు పూర్తి కాలేదని అధికారులను ప్రశ్నించారు..వీటిలో ఎక్కువ శాతం సమగ్ర శిక్ష వద్దే 16 ఉన్నాయని వాటిలో ఎర్రకోట గ్రామంలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలకు 12 మంజూరు కాగా వాటిలో ఇంకా 2 మొదలు పెట్టలేదన్నారు.. వారం, వారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనుల పురోగతి పై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని,  పనులలో పురోగతి ఎందుకు లేదని జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ సమీక్ష సమావేశం పూర్తి అయిన తరువాత అదనపు తరగతుల గదుల నిర్మాణాలకు సంబంధించి ఎర్రకోటలో 2, గుడేకల్లులో 4, కోటేకల్లులో 4 పెండింగ్ లో ఉన్న వాటిని డిఈఓ, పంచాయతీ రాజ్ డిఈ, సమగ్ర శిక్ష ఈఈ ఈ రోజే సదరు పాఠశాలను పరిశీలించి పనులు మొదలు చేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు పెండింగ్ లో ఉన్న అన్ని అదనపు తరగతి గదుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చెయ్యాలని సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.కౌతాళం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో అదనపు తరగతి గది నిర్మాణం చేపట్టకుండా, కేవలం మరమ్మతులు మాత్రమే చేశామని సంబంధిత అధికారులు తెలుపగా అదనపు తరగతి నిర్మాణం కోసం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ తీసుకొని కేవలం మరమ్మత్తులు ఎలా చేస్తారని జిల్లా కలెక్టర్ కౌతాళం ఏఈపై కఠిన చర్యలు తీసుకోవాలని సమగ్ర శిక్ష ఈఈ కలెక్టర్ ఆదేశించారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ మంజూరు చేసిన వాటిని తప్ప ఇంకే ఇతర నిర్మాణాలు చేపట్టినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.టాయిలెట్ విత్ రన్నింగ్ వాటర్ కు సంబంధించి 685 పనులు మంజూరు కాగా వాటిలో 589 పూర్తి చేయడం జరిగిందని, ఇందులో సివిల్ వర్క్స్ ఎక్కువ శాతం సమగ్ర శిక్ష వారే పూర్తి చేయాల్సి ఉందని, అదే విధంగా కిచెన్ షేడ్స్ కు సంబంధించి 515 మంజూరు కాగా వీటిలో 444 పూర్తి అయ్యాయని, పెండింగ్ ఉన్న టాయిలెట్ విత్ రన్నింగ్ వాటర్, కిచెన్ షేడ్స్ ను శనివారం లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.మన బడి నాడు-నేడు ఫేజ్-2 ద్వారా 81 అంగన్వాడీ కేంద్రాలలో అదనపు తరగతి గదులు మంజూరు కాగా వాటిలో 42 బేస్మెంట్ లెవెల్ ఉన్నాయని, వీటిని కూడా అక్టోబర్ 2వ తేది నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వీటికి సంబంధించి స్టేజ్ కన్వర్షన్ వివరాలను కూడా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ఎస్ఏ పిఓకు సూచించారు.  అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి 92 మంజూరు కాగా, వాటిలో 28 పూర్తి అయ్యాయని, మిగతా 64 కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోకు సంబంధించి వాలంటీర్ల ద్వారా 4.79 లక్షల మంది పిల్లలను సర్వే చేయడం జరిగిందన్నారు. ఇంకా పెండింగ్ ఉన్న వారిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అందుకుగాను వాలంటీర్ల ద్వారా సర్వే పూర్తి చేసేలా మున్సిపల్ కమీషనర్లు, ఎంపిడిఓలు చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం నాటికి సిస్టమ్ డ్రాప్ ఔట్స్, స్కూల్ డ్రాప్ ఔట్స్ లేకుండా చూడడంతో పాటు ఓవర్ ఏజ్, అండర్ ఏజ్ ఉన్న వారిపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అదే విధంగా పదవ తరగతి, ఇంటర్మీడియేట్ తప్పిన విద్యార్థులను కూడా ఓపెన్ స్కూల్ లో చేర్చడంతో పాటు చైల్డ్ ఇన్ఫో నందు కూడా అప్డేట్ చేయాలన్నారు. అనంతరం ఎస్ఎస్ఏ పిఓ మాట్లాడుతూ ఫేజ్-2 రివాల్వింగ్ ఫండ్ కు సంబంధించి మొత్తం 622 పాఠశాలలో కేవలం 111 పాఠశాలలు మాత్రమే రివాల్వింగ్ ఫండ్ జనరేట్ చేశాయని, మిగతా 511 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆర్ఎఫ్ జనరేట్ చేసేలా ఎంఈఓలు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు వివరించారు. అదే విధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ లాగిన్ నందు స్పెల్-1 కు ఉన్న నిర్మాణాలను పూర్తి చేయడంతో పాటు ఇంకా ఎక్కడైనా నిర్మాణాలు అవసరం ఉంటే పేరెంట్స్ కమిటీ, ఎంఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ అధికారులతో సంతకం చేయించిన యెడల జిల్లా కలెక్టర్ అనుమతితో నిర్మాణ అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని వివరించారు.కార్యక్రమంలో ఎస్ఎస్ఏ పిఓ డా.కె.వేణుగోపాల్, జిల్లా విద్యా శాఖధికారి రంగారెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్ఈ సుబ్రహ్మణ్యం, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు, డివిఈఓ జమీర్ భాష, సంబంధిత శాఖ అధికారులు, ఎంఈఓలు, సిడిపిఓలు తదితరులు పాల్గొన్నారు.

About Author