ప్రజలలోకి వెళ్లి సంక్షేమ పథకాలను వివరించండి
1 min read– కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే రవి రెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలను, అలాగే మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల విషయాలను ప్రజలకు తెలియజేయాలని, అందుకు వైఎస్ఆర్సిపి మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బూత్ కమిటీ సభ్యులు అందరూ సమన్వయంతో కలిసికట్టుగా గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ఈ 5 సంవత్సరాలలో ఏ ఇంటికి ఎంత లబ్ధి చేరింది వివరించి, మండలంలో వైయస్ఆర్ సీపీకి అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి వైయస్సార్సీపి నాయకులకు కార్యకర్తలకు సూచించారు, సోమవారం ఆయన స్థానిక బ్రాహ్మణ వీధిలో వైఎస్ఆర్సిపి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన వైఎస్ఆర్సిపి నాయకులకు ,కార్యకర్తలకు, బూత్ కమిటీల సభ్యులకు పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీలకతీతంగా కులాలకు మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారని, ఈ ఐదు సంవత్సరాలలో ఆయన రాష్ట్రంలో సుస్థిర పాలన ప్రజలకు అందివ్వడం జరిగిందని, ఆయన పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, రాబోవు సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సిపి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగుతారని ఆయన తెలియజేశారు.నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే రవి రెడ్డి, నరేన్ రెడ్డి…. చెన్నూరు అరుంధతి నగర్ లోని మొయిల కాలువ శంకరయ్య కుమార్తె వివాహానికి హాజరైన ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన తనయులు చింతకొమ్మదిన్నె జడ్పిటిసి నరేన్ రామాంజనేయులు రెడ్డి హాజరై వధువు అఖిల, వరుడు బాల గురువయ్యలను ఆశీర్వదించారు, ఈ కార్యక్రమంలో, వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, వైయస్ఆర్సీపీ మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్, వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, సొసైటీ అధ్యక్షులు అల్లి శ్రీరామమూర్తి, జే సి ఎస్ మండల కన్వీనర్ నిరంజన్ రెడ్డి, శ్రీనివాసరాజు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఓబుల్ రెడ్డి (చిన్న బాబు) అన్వర్ భాష, అబ్దుల్ రబ్, ఎంపీటీసీలు ,సర్పంచులు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.