మోసపూరిత హామీలపై..ప్రజలకు వివరించండి
1 min read
పట్టణంలో వైయస్సార్ 76వ జయంతి
హాజరైన జిల్లా అధ్యక్షుడు కాటసాని,డాక్టర్ సుధీర్..
నందికొట్కూరు, న్యూస్ నేడు: ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన మోస పూరిత హామీల గురించి ఈనెల చివరి వరకూ అన్ని గ్రామాల్లో ప్రజలకు వివరించాలని నందికొట్కూరు వైసీపీ సమన్వయకర్త డాక్టర్ ధారా సుధీర్ కార్యకర్తలకు సూచించారు.మంగళవారం వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలను నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు.వైసీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి,డాక్టర్ సుధీర్,ఎమ్మెల్సీలు కల్పలతా రెడ్డి,ఇసాక్ భాష వైయస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.తర్వాత పట్టణంలోని చాముండీ ఫంక్షన్ హాల్ లో జరిగిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ 2019-24 వరకు వైకాపా ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించారని అన్నారు.చంద్రబాబు ఎన్నికలకు ముందుగా సూపర్ సిక్స్ అంటూ ప్రజలకు హామీలు ఇచ్చారని హామీలతో ప్రజలను మోసం చేశారని కాటసాని అన్నారు.
రక్తదానం చేసిన 102 మంది కార్యకర్తలు
వైయస్సార్ జయంతి సందర్భంగా 102 మంది కార్యకర్తలు రక్తదానం చేశారు. వీరందరికీ సర్టిఫికెట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలోజిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జడ్పీటీసీలు పర్వత యుగంధర్ రెడ్డి,జగదీశ్వర్ రెడ్డి,పుల్యాల దివ్య,పట్టణ అధ్యక్షులు మన్సూర్,నాగిరెడ్డి, తువ్వా లోకేశ్వర్ రెడ్డి,బద్దుల శ్రీకాంత్ వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
