NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అన్నదాన విభాగంలో పేలిన స్టీమర్..తప్పిన ప్రమాదం

1 min read

పల్లెవెలుగు, వెబ్ శ్రీశైలం: ప్రఖ్యాత శ్రీశైల క్షేత్రం వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన నిత్య అన్నప్రసాదం తయారీ విభాగంలో మంగళవారం ఆవిరితో పనిచేసే బాయిలర్ (స్టీం బాయిలర్) ఒకటి అకస్మాత్తుగా పేలిపోయింది. పేలుడు ధాటికి అన్నదానం భవనం రేకులు పై కప్పు లేచిపోయాయి భక్తులకు త్వరితగతిన అన్నప్రసాదాన్ని అందించడానికి దేవస్థానం వారు. బాయిలర్ స్టీం వాడుతున్నారు. బాయిలర్ స్టీం నిర్వహణ సరిగా లేకపోవడం కారణంగా స్టీం బాయిలర్ పరిమితికి మించి వేడెక్కినపుడు. తెరుచోవాల్సిన వాల్వులు సరిగా పనిచేయకపోవడమే కారణమా లేకా మరే ఇతర కారణమా.. అనేది తెలియాల్సి ఉంది పేలుడు ప్రమాదం ఉదయం 10 సమయంలో సంభవించింది. బాయిలర్ శకలాలు అన్నదాన ప్రసాద భవనాన్ని ప్రహరీ గోడ లోపల పడటంతోఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనను ఈఓ లవన్న పరిశీలించారు.

About Author