మోదీ ర్యాలీలో పేలుళ్ల ఘటన.. నలుగురికి ఉరిశిక్ష !
1 min readపల్లెవెలుగువెబ్: మోదీ ర్యాలీలో పేలుళ్ల ఘటనలో నలుగురికి ఉరిశిక్ష పడింది. 2013 బీహార్ రాజధాని పాట్నాలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో ఇప్పటికే 9 మందిని దోషులుగా తేల్చిన ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం… నేడు శిక్ష ఖరారు చేసింది. నలుగురికి ఉరిశిక్ష, ఇద్దరికి జీవిత ఖైదు, ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. మరొకరికి ఏఢేళ్ల శిక్ష విధించింది. 2013లో ఎన్డీఏ ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించిన సందర్భంలో పట్నాలోని గాంధీ మైదానంలో హుంకార్
పేరుతో భారీ ర్యాలీ చేపట్టారు. ఆ సమయంలో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నారు. మోదీ ప్రసంగించాల్సిన స్టేజికి 150 మీటర్ల దూరంలో వరుసగా ఆరు పేళుల్లు సంభవించాయి. మోదీ సభకు రాకముందే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుళ్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 70 మందికి గాయాలయ్యాయి. ఈ కేసును అప్పట్లో ఎన్ఐఎకు అప్పగించారు.