రూపాయల్లోనే ఎగుమతి, దిగుమతులు !
1 min readపల్లెవెలుగువెబ్ : రూపాయల్లో ఎగుమతి, దిగుమతి లావాదేవీల పరిష్కారానికి అదనపు ఏర్పాట్లు చేయాలని బ్యాంక్‌లను భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించింది. అంతర్జాతీయ వర్తకుల్లో రూపాయల్లో వాణిజ్యంపై ఆసక్తి పెరిగిన నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ ఏర్పాట్లకు ముందు ఆర్‌బీఐలోని ఫారిన్ ఎక్స్ఛేంజ్ డిపార్ట్‌మెంట్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుం ది. అలాగే, వాణిజ్య భాగస్వామ్య దేశాల మధ్య కరెన్సీల మారకం రేటు మార్కెట్ నిర్దేశిత రేటు ప్రకారం జరుగుతుందని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది.