NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగన్వాడీలు చేస్తున్న నిరసనకు సంఘీభావం

1 min read

జనసేన పార్టీ నాయకులు రెడ్డి అప్పలనాయుడు

అంగన్వాడి సమస్యలు పరిష్కారంచకుంటే సీఎం ప్యాలస్సును ముట్టడిస్తాం

పల్లె వెలుగు, ఏలూరు జిల్లా : ఏలూరు నియోజకవర్గం లోని ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంగన్వాడి పై ప్రభుత్వం ఏస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి అంగన్వాడి అనుబంధ సంఘాలు బుధవారం రోజు పిలుపునిచ్చాయి. దీంతో ఫైర్ స్టేషన్ సెంటర్లో అంగన్వాడి మహిళలు బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. కొంతమంది ఆందోళన చేస్తున్న అంగన్వాడి మహిళలు స్పృహతప్పి కింద పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రెడ్డి అప్పలనాయుడు వెంటనే వాళ్లను పరామర్శించి వాళ్లకు ఏలూరు జనసేన పార్టీ నుండి సంఘీభావాన్ని తెలియజేశారు. అంగన్వాడీలను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.. అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా జనసేన, తెలుగుదేశం ఇతర వామ పక్షాల పార్టీలు సంఘీభావం తెలిపాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించకపోతే అంగన్వాడీలు మొత్తం సీఎం జగన్ ప్యాలెస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీని చేపట్టారు.

About Author