ఆస్తి పన్ను బకాయిలపై 50% వడ్డీ మాఫీ గడువు పొడిగింపు
1 min read
నగరపాలక అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ
ఆస్తి పన్ను నాలుగు రోజుల్లో నాలుగున్నర కోట్ల వసూళ్లు
ఆస్తి పన్నుపై 5% రాయితీకి విశేష స్పందన
కర్నూలు, న్యూస్ నేడు: గురువారం ఆస్తి పన్ను బకాయిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త తెలిపిందని, ఆస్తి పన్నుపై 50% వడ్డీ మాఫీ పొందేందుకు గడువు ఏప్రిల్ 30 వరకు పొడిగించిందని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వడ్డీపై మాఫి నూతన సంవత్సర ప్రారంభ నెలలో సైతం వర్తింపజేయడం ఇదే మొదటిసారి అని, ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 66 జారీ చేసిందన్నారు. కాగా ఇప్పటికే నూతన సంవత్సర పన్నులను ఏక మొత్తంలో చెల్లించే వారికి 5% రాయితీకి పన్నుదారుల నుండి విశేష స్పందన లభిస్తోందన్నారు. గడిచిన నాలుగు రోజుల్లో ఆస్తి పన్ను, రూ.4.50 కోట్లు వసూలు అయిందని, అలాగే తాగునీటి కొళాయి చార్జీలు రూ.50 లక్షలు వసూలు అయ్యాయని పేర్కొన్నారు. కావున మిగిలిన బకాయిదారులు తక్షణమే తమ పన్నులను చెల్లించి, బకాయిలపై 50% వడ్డీ రాయితీ, 2025-26 వ సంవత్సర పన్నులపై 5% పొందాలని అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ కోరారు.