PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లింగపాలెం మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం..

1 min read

చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు

పెద్ద ఎత్తున కదలి వచ్చిన జన సైన్యం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : లింగపాలెం మండలం లక్ష్మీపురం గ్రామంలో చింతలపూడి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయ రాజు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎండను సైతం లెక్కచేయకుండా మహిళలు రోడ్లపై కొచ్చి విజయరాజు కి స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు. గ్రామస్తులు మహిళలు పార్టీ నాయకులు కార్యకర్తలు  విజయ రాజు ఎన్నికల ప్రచారం గ్రామంలో నిర్వహించగా ఆయన వెంట గ్రామమంతా జన సైన్యంల కదల వచ్చి ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. విజయరాజు, లక్ష్మీపురం గ్రామంలో విజయ రాజు  ప్రచారానికి అనుహస్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో మండల వైఎస్సార్ సీపీ నాయకులు, గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు గ్రామ పెద్దలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Author