PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

200మందికి కంటి వైద్య పరీక్షలు..40 ఆపరేషన్లు..

1 min read

పల్లెవెలుగు వెబ్​:చెన్నూరు  మండలం లోని గుర్రంపాడు గ్రామపంచాయతీ లోని ఓబులంపల్లి గ్రామంలో లక్ష్మీనారాయణ హాస్పిటల్ నందు ముండ్ల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో  శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉచిత కంటి పరీక్షలు, నిర్వహించారు, ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడుతూ, మండల ప్రజలకు తమ వంతు సేవ చేయాలనే భావనతో  ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లుతెలియజేశారు వారు తెలియజేశారు, ఈ కంటి పరీక్షలు, అదేవిధంగా ఆపరేషన్ల శిబిరానికి సంబంధించి బద్వేల్ కు చెందిన దివంగత బిజివేముల వీరారెడ్డి  చారిటబుల్ ట్రస్ట్ కంటి వైద్యులు డాక్టర్ రవి కుమార్ రెడ్డి, డాక్టర్ పంక జనాభ, డాక్టర్ ప్రదీప్ కుమార్, డాక్టర్ శాంతి, వైద్య సిబ్బంది వారిచే కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు లక్ష్మీనారాయణ హాస్పిటల్ వారు  తెలిపారు, మండలంలో నే కాకుండా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలకు వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి అనంతరం వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది అన్నారు, అంతేకాకుండా అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందని వారు తెలియజేశారు, కంటి ఆపరేషన్లు చేయించుకో తగిన వారు ఒక మనిషిని తోడుగా తీసుకొచ్చుకోవాలని, అలాగే రెండు దుప్పట్లు వెంట తెచ్చుకోవాలని డాక్టర్లు వారికి సూచించారు, అలాగే ఈ కంటి ఉచితంగా వైద్య శిబిరంలో, దాదాపు 2 వందల మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది అన్నారు, అలాగే 40 మందికి కంటి ఆపరేషన్లు అవసరమవుతాయని డాక్టర్లు నిర్ధారించడం జరిగింది, ఈ 40 మందికి లక్ష్మీనారాయణ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా ఆదివారం ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందని వారు తెలియజేశారు, కంటి ఆపరేషన్లు నిర్వహించడమే కాకుండా, వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని లక్ష్మీనారాయణ హాస్పిటల్ తెలియజేసింది, కాగా ఈ ఉచిత కంటి వైద్య మెగా శిబిరానికి మండల వ్యాప్తంగా మంచి విశేష స్పందన లభించినట్లు వారు తెలియజేశారు, ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ హాస్పిటల్ వారిని మండల ప్రజలు ప్రశంసల తో ముంచేత్తారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ల బృందం తో పాటు ముండ్ల లక్ష్మి శేఖర్ రెడ్డి, ముండ్ల శ్రీనివాసులరెడ్డి , గాజుల పల్లె పురుషోత్తం రెడ్డి, ఎస్ రఘురాం రెడ్డి, వై సాయి శివ, కే వేణు, సురేషు, హర్షవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు,

About Author