NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డిజిట‌ల్ మీడియాకు క‌ళ్లెం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశంలో తొలిసారి డిజిటల్‌ మీడియాకు కళ్లెం వేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. చట్ట నిబంధనలను డిజిటల్‌ న్యూస్‌ సైట్స్‌ ఉల్లంఘిస్తే జరిమానాలు విధించడంతో పాటు వాటి రిజిస్ట్రేషన్‌ను కూడా రద్దుచేసేలా కేంద్ర సమాచార ప్రసార శాఖ బిల్లు సిద్ధం చేస్తోంది. వచ్చే వారం ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో దానిని ప్రవేశపెట్టనుంది. డిజిటల్‌ మీడియాను ఏ చట్టంలోనూ ఇంతవరకు నిర్వచించలేదు. ప్రభుత్వ అజమాయుషీ కూడా లేదు. ఈ నేపథ్యంలో మీడియా రిజిస్ట్రేషన్‌ చట్టంలో మొదటిసారి డిజిటల్‌ మీడియాను చొప్పిస్తూ చట్టం రానుంది. కేంద్ర సమాచార ప్రసార శాఖ దీనికి పరిపాలక విభాగంగా పనిచేస్తుంది. బ్రిటిష్‌ కాలంనాటి ‘ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ బుక్స్‌ యాక్ట్‌ (1867) స్థానంలో తీసుకురానున్న తాజా ‘రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ ప్రెస్‌ అండ్‌ పీరియాడికల్స్‌ బిల్లు’ ప్రకారం.. ఈ చట్టం అమల్లోకి వచ్చిన 90 రోజుల్లోపు డిజిటల్‌ న్యూస్‌ పబ్లిషర్లు రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ప్రెస్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ వద్ద దరఖాస్తు చేసుకోవాలి. ఉల్లంఘనలకు పాల్పడే పబ్లిషర్లపై చర్యలు తీసుకునే అధికారం, రిజిస్ట్రేషన్లను రద్దుచేయడం వంటి అధికారాలు కూడా ఈయనకు ఉన్నాయి. ఆయా చర్యలపై అప్పీలుకు వెళ్లేందుకు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్‌పర్సన్‌ సారథ్యంలో అప్పిలేట్‌ బోర్డు ఏర్పాటు చేయాలనే యోచన ఉంది.

                                      

About Author