NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

F3 మూవీ ట్విట్ట‌ర్ రివ్యూ

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ఎఫ్ 3 . తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్‌గా నటించారు. 2019 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎఫ్ 2 భారీ సక్సెస్ సాధించడంతో ఇప్పుడు రిలీజైన ఎఫ్ 3 మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఎఫ్‌3 మూవీ చాలా బాగుంది. వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ల కామెడీ అదిరిపోయింది. లాజిక్‌ని పక్కన పెట్టి చూస్తే ఎఫ్‌3 ని బాగా ఎంజాయ్‌ చేస్తారు. అని ఓ నెటిజన్‌ ట్వీట్ చేశాడు. ఫస్టాఫ్‌ యావరేజ్‌గా ఉంది. కొన్ని కామెడీ సీన్స్‌ తప్ప..మిగతా సినిమా అంతా బోరింగ్‌గా ఉంది. ప్రొడక్షన్స్‌ వ్యాల్యూస్‌ బాలేవు. అని మరో నెటిజన్స్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఫస్టాఫ్‌ యావరేజ్‌గా ఉంది. మొదటి 15 నిమిషాలు సాగదీసినట్టు అనిపిస్తుంది. కామెడీ ఓకే. సెకండాఫ్‌లో కామెడీ అదరిపోయింది. మూవీ చాలా బాగుంది.. అని నెటిజన్ తన రివ్యూ చెప్పాడు.

                                

About Author