తాలిబన్లను ఉగ్రవాదులుగా ప్రకటించిన ‘ ఫేస్ బుక్’
1 min readపల్లెవెలుగు వెబ్ : ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ తాలిబన్లను ఉగ్రవాదులుగా పేర్కొంది. వారికి సంబంధించిన కంటెంట్ ను తమ సంస్థ ఫ్లాట్ ఫామ్ పై నిషేధించామని ప్రకటించింది. ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్టెడ్ మెసేజ్ లను పంపే వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికను తాలిబన్లు యథేచ్చగా వాడుతున్నారు. ఆఫ్ఘాన్ లో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, నిషేధిత సంస్థలకు చెందిన వాట్సాప్ అకౌంట్ లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు ట్విట్టర్ ను తాలిబన్లు యథేచ్చగా వాడుకుంటున్నారు. ఆప్ఘన్ ఆక్రమించుకున్న సంగతి ట్విట్టర్ వేదికగానే తాలిబన్లు ప్రకటించారు.