ఉద్యోగులందరికీ ఫేసియల్ రికగ్నిషన్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ముఖ ఆధారిత హాజరు ప్రభుత్వంలోని అన్ని శాఖలకూ విస్తరించనుంది. ఈ విధానాన్ని అటెండర్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకూ అందరికీ అమలు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఉద్యోగుల సెల్‌ఫోన్ల ద్వారా నమోదు చేయాలా… ప్రభుత్వమే పరికరాలు ఇస్తుందా అనే అంశంపై ఆయా శాఖలు నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. మొత్తంగా ముఖ హాజరు అనేది అందరికీ తప్పనిసరి అని మంత్రి స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే మొదట విద్యాశాఖలో టీచర్లకు అమలు చేస్తున్నామన్నారు. ఏవైనా ఇబ్బందులుంటే పరిష్కరిస్తాం తప్ప మొత్తం విధానాన్నే వ్యతిరేకించడం సరికాదని హితవు పలికారు.