అపజయం విజయానికి తొలి మెట్టు.. డాక్టర్ కిషోర్ కుమార్
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలంలో.విద్యార్థులకు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరిక ఉండాలని శాంతిరాం జనరల్ హాస్పిటల్ సైకియాట్రిక్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కిషోర్ కుమార్ అన్నారు. స్థానిక బనగానపల్లె మండలం రామతీర్థం జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలోపాఠశాలప్రధానోపాధ్యాయులు సుబ్బన్న అధ్యక్షతన జరిగిన సెమినార్లో ఈరోజు “విద్యార్థులు- విద్యా మనోవికాసము” అన్న అంశంపై మాట్లాడుతూ విద్యార్థులు విద్యారంగంలో రాణించాలంటే చేరుకోవాలని కోరిక కలిగి ఉండాలన్నాడు కోరికతో పాటు సాధించాలని పట్టుదల కలిగి ఉండి అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుని నడుచుకున్నట్లయితే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. ముఖ్యంగా నేడు మనలను సెల్ ఫోను అనేకవిధాలుగాబానిసలుగాచేస్తుందన్నారు.ఈనాడు విద్యార్థులు సెల్ ఫోనుకు బానిసై విద్య పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా క్షణికావేశాలకు పోయి అనేకమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కొంచెం నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు.విద్యలో వెనుకబడిన వారు మరియు ఫెయిల్ అయిన వారు దిగులు చెందవలసిన అవసరం లేదని, ఒత్తిడికి గురి కావాల్సిన అవసరం లేదని, వేదనకు గురికాకుండా అపజయాలే విజయానికి తొలి మెట్టని భావించి ముందుకు సాగినట్లయితే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొజెక్టర్ ద్వారా విద్యార్థులకు వివిధ అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో శాంతిరాం వైద్య కళాశాల డాక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు డాక్టర్ కిషోర్ కుమార్ ను శాలువా,పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలోఉపాధ్యాయులురాజశేఖర్,సురేంద్ర, సుధాకర్, బద్రీనాథ్, తిమ్మరాజయ్య, పుల్లమ్మ, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.