PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘కోవిడ్​’ నియంత్రణలో విఫలం

1 min read
మాట్లాడుతున్న డా. శైలజానాథ్​

మాట్లాడుతున్న డా. శైలజానాథ్​

– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై డా.ఎస్​. శైలజానాథ్​ ఫైర్​
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కోవిడ్​ నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలపై చూపిన శ్రద్ధ.. వైరస్​ నియంత్రణపై చూపలేదని, ప్రపంచ దేశాలన్నీ మోదీ ప్రభుత్వం విఫలమైందని వేలెత్తి చూపుతున్నా…పట్టించుకోవడంలేదని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాల ప్రచారం పై ఉన్న శ్రద్ధ కరోన నియంత్రణపై చూపించడం లేదని, రాష్ట్రంలో వ్యాక్సిన్లు నల్ల బజారుకు తరలిపోతున్నా జగన్ ప్రభుత్వం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉందన్నారు. వ్యాక్సిన్ల కోసం ప్రజలు హెల్త్​ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నా నో స్టాక్​ బోర్డులతో వెనుదిరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి, పథకాలకు వేల కోట్లు రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం… ప్రజలకు ప్రాణవాయువు కల్పించలేని దుస్థితిలో ఉందన్నారు. మంత్రులు ఏసీ గదులకే పరిమితమయ్యారని, కనీసం కోవిడ్​ ఆస్పత్రులలో రోగులకు బెడ్స్​ కూడా ఏర్పాటు చేయడంలేదన్నారు. రైతులు వ్యవసాయ కూలీలు లాక్డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని కనుక ప్రతి ఇంటికీ రూ.7వేల ఇప్పించాలన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ప్రతి ఇంటికీ వెళ్లి వ్యాక్సినేషన్​ వేయించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ యం సుధాకర్ బాబు, రాష్ట్ర ఎన్ఎస్యూఐ అధ్యక్షులు జి నాగమధు యాదవ్, డిసీసీ ఉపాధ్యక్షులు కె పెద్దా రెడ్డి, కర్నూలు నగర కాంగ్రెస్ అధ్యక్షులు జాన్ విల్సన్, మంత్రాలయం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి బాబు రావు, డాక్టర్స్ సెల్ అధ్యక్షులు డాక్టర్ అమరేంద్ర రెడ్డి, ఎన్ ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, రియాజ్ రవి తదితరులు పాల్గొన్నారు.

About Author