న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి..
1 min readపల్లెవెలుగు, వెబ్ విజయవాడ:మిలిటరీ విభాగం తరువాత అహోరాత్రులు ఎండనక వాననక 24 గంటలు పని చేస్తూ రైల్వే ను ప్రగతి చక్రాలపై పరిగెత్తిస్తున్న రైల్వే కార్మికులకు నూతన పెన్షన్ విధానం నుండి మినహాయింపు లేకపోవటం అన్యాయమని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ విజయవాడ డివిజనల్ సెక్రటరీ కామ్రేడ్ జి ఎన్ శ్రీనివాస రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే కార్మికుల న్యాయమైన డిమాండ్ లను ఆమోదించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్, న్యూ ఢిల్లీ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ ఇచ్చిన పిలుపు మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ విజయవాడ డివిజన్ ఆధ్వర్యములో బుధవారం నాడు విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం ముందు, గూడూరు నుండి అనకాపల్లి వరకు అన్ని బ్రాంచ్ కేంద్రాల లో మజ్దూర్ యూనియన్ కార్యకర్తలు నిరాహార దీక్ష చేపట్టారు. రైల్వే కార్మికులను నూతన పెన్షన్ విధానం నుండి మినహాయించి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో రైల్వే కార్మికులు నిరాహార దీక్షలో పాల్గొని తమ నిరసన తెలియ చేసారు. ఈ సందర్భముగా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ విజయవాడ డివిజనల్ సెక్రటరీ కామ్రేడ్ జి ఎన్ శ్రీనివాస రావు మాట్లాడుతూ నలభై సంవత్సరాలపాటు రైల్వే కి సేవ చేసి పదవీ విరమణ తరువాత ఎటువంటి కనీస పెన్షన్ గ్యారంటీ ఇవ్వని నూతన పెన్షన్ విధానమును రద్దు చేయాలని 2004 తరువాత నుండి రైల్వే లో చేరిన రైల్వే కార్మికులందరికి బేషరతుగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసారు. అలాగే రైల్వే లో లక్షల సంఖ్యలో వున్న ఖాళీ లను వెంటనే భర్తీ చేయాలని, పెరుగుతున్న ట్రాక్, రైళ్లకు తగ్గట్టుగా నూతన సిబ్బందిని మంజూరు చేయాలని, సరైన పదోన్నతి అవకాశాలు లేని సీనియర్ సూపెర్వైజర్ లకు 5400 మరియు 6600 గ్రేడ్ పే ఇవ్వాలని, అన్ని విభాగాల లోని కార్మికులకు రీ సృక్చరింగ్ అమలు చేయాలని అన్నారు. సేఫ్టీ విభాగములలో పని చేస్తున్న కార్మికులందరికీ రిస్క్ అలవెన్సు ను చెల్లించాలని, కరోనా కాలములో ఆపి వేసిన 18 నెలల కరువు భృత్యాన్ని చెల్లించాలని, నైట్ డ్యూటీలు చేసిన ప్రతి ఒక్కరికి నైట్ డ్యూటీ అలవెన్స్ బకాయిలు చెల్లించాలని అన్నారు.అలాగే రైల్వే లో ప్రైవైటీకరణ ను రద్దు చేయాలని , రైల్వే ఆస్తుల అమ్మకం ఆపాలని డిమాండ్ చేశారు.