PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పశుసంవర్ధక శాఖ ఉద్యోగాల భర్తీలో నకిలీ సర్టిఫికెట్ల దందాను అరికట్టండి

1 min read

కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన ఆర్విపిఎస్,డివైఎఫ్ఐ,ఎస్ఎఫ్ఐ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పశుసంవర్ధక శాఖ ఉద్యోగాల భర్తీలో నకిలీ సర్టిఫికెట్ల దందాను అరికట్టాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్,డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రంగప్ప,అబ్దుల్లా,రాయలసీమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుంకన్న,రాయలసీమ యువజన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు వీవీ నాయుడు,రాయలసీమ విద్యార్థి పోరాట సమితి జిల్లా అధ్యక్షులు అశోక్ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు,అనంతరం వారు జిల్లా జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య ను మరియు కర్నూలు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రామచంద్రయ్యలను  కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా రవికుమార్ రాఘవేంద్ర అబ్దుల్లా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం గ్రామ సచివాలయంలో అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్(ఏ హెచ్ ఏ) పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేశారని దీనిలో భాగంగా రెండు సంవత్సరాల వెటర్నరీ పాలిటెక్నిక్,డైరీ సైన్స్,ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులను క్వాలిఫికేషన్ గా నిర్ణయించడం జరిగింది కానీ, కర్నూలు జిల్లాలో మరియు రాష్ట్రంలో  చాలా ఎక్కువ సంఖ్యలో నిరుద్యోగులు ఒక్కొక్కరు ఒక లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు వెచ్చించి భారత్ సేవక్ సమాజ్ అనే  సంస్థ ద్వారా నకిలీ ధ్రువపత్రాలు కొనుగోలు చేసి  ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరుగుతుందని మరియు పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు, గోపాలమిత్రాలు, గోపాలమిత్ర సూపర్వైజర్లు, అవుట్సోర్సింగ్ అటెండెంట్ ,నెలనెలా డ్యూటీ సర్టిఫికెట్లను సమర్పిస్తూ నెలవారిగా జీతాలు తీసుకుంటూ రెగ్యులర్ ప్రాతిపదికన రెండు సంవత్సరముల డైరీ ఒకేషనల్ కోర్సును ఏకకాలంలో పూర్తిచేసినట్లు ప్రభుత్వాన్ని మరియు ప్రభుత్వ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు, వారు ఉద్యోగాలను నిర్వహిస్తూనే రెగ్యులర్ కోర్స్ గా ఉన్న డైరీ సైన్స్, ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సును ఎలా పూర్తి చేశారో వారికి  వెయిటేజీ 15 మార్కులను ఎలా ఇస్తున్నారో ప్రభుత్వ అధికారులు మరియు రాష్ట్ర సంచాలకులు డాక్టర్ అమరేంద్ర కుమార్ తెలపాలని కోరారు. చాలామంది కోర్సులు పూర్తి చేయకుండానే నకిలీ సర్టిఫికెట్లను కొని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారని అలాంటి వారినీ, వారికి నకిలీ సర్టిఫికెట్లను జారీ చేసిన సంస్థలను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు అర్హులకు న్యాయం జరుగక పోతే  ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో విద్యార్థులు మగ్బుల్,వెంకటేశ్వర్లు,సుధాకర్,జయరామ్, గోపాల్ ,హరి,రమేష్ ,మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.

About Author