నకిలీ చలానా కేసు.. మరో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లు సస్పెండ్ !
1 min readపల్లెవెలుగు వెబ్: ఏపీలో నకిలీ చలానా కేసులో సబ్ రిజిస్ట్రార్ల సస్పెన్షన్ కొనసాగుతోంది. ఈ కుంభకోణంలో మరో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కృష్ణా జిల్లా మండవల్లి సబ్ రిజిస్ట్రార్ సుబ్రమణ్యం, విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు, కడప సబ్ రిజిస్ట్రార్ ను ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. ఈ వ్యవహారంలో మొత్తం 9 మంది సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సబ్ రిజిస్ట్రార్ల సస్పెన్షన్ తో ఆయా కార్యాలయాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. 9 మంది సబ్ రిజిస్ట్రార్లను విధుల నుంచి తొలగించడం రాష్ట్ర వ్యాప్తం చర్చనీయాంశంగా మారింది.