నకిలీ హోమ్ లోన్స్.. 14 వేల కోట్ల మోసం
1 min readప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భారీ దోపిడికి తెర తీశారు డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు. 2లక్షల 60 వేల నకిలీ హోమ్ లోన్ అకౌంట్ల ద్వార 14000 కోట్లు అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ పేర్కొంది. డీహెచ్ఎఫ్ ఎల్ ప్రమోటర్లు.. కొన్ని షెల్ కంపెనీలు సృష్టించి వాటి అకౌంట్లలోకి 11,755 కోట్లు మళ్లించినట్టు దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఈ మొత్తం స్కాంలో 1887 కోట్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సబ్సీడి కూడ పొందారు డీహచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు . డీహెచ్ ఎఫ్ ఎల్ ప్రమోటర్లుగా ఉన్న కపిల్ వద్వన్, ధీరజ్ వద్వాన్ మీద ఇప్పటికే మరో రెండు కేసుల్లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఇందులో యస్ బ్యాంకు కేసుక ఒకటి కాగా.. మరొకటి యూపీ పవర్ కార్పొరేషన్ లో అక్రమాల కేసు.