ఎంపీకి వ్యాక్సిన్ వేయించిన నకిలీ ఐఏఎస్ !
1 min read
పల్లెవెలుగు వెబ్: టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తికి వ్యాక్సిన్ వేయించాడు ఓ నకిలీ ఐఏఎస్. కోలకత్తలోని కాస్బా ప్రాంతంలో వ్యాక్సిన్ వేసే కార్యక్రమానికి ఆమెను ఆహ్వానించాడు. వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమం అనడంతో .. మిమి చక్రవర్తి వెంటనే ఒప్పుకుంది.కాస్బా ప్రాంతానికి వెళ్లి ప్రజలకు వ్యాక్సిన్ పై అవగాహన కల్పించింది. వారితో పాటు వ్యాక్సిన్ వేయించుకుంది. వ్యాక్సిన్ వేసుకున్నాక ఫోన్ కు మెసేజ్ వస్తుంది. తన ఫోన్ కి వ్యాక్సిన్ వేసుకున్నట్టు మెసేజ్ రాకపోవడంతో ఆమె కు అనుమానం వచ్చింది. సదరు ఐఏఎస్ అధికారిని అడగగా.. అతడి నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. అనుమానం వచ్చిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు అతడో నకిలీ ఐఏఎస్ అని గుర్తించారు. గతంలో ఆటో డ్రైవర్లకు కూడ వ్యాక్సిన్ వేయించనట్టు పోలీసులు తెలిపారు. 200 కరోన వయల్స్ ఆ నకిలీ ఐఏఎస్ కు ఎలా వచ్చాయో గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు.