కుదేలవుతున్న క్రిప్టో కరెన్సీ
1 min readపల్లెవెలుగు వెబ్: క్రిప్టో కరెన్సీ పట్ల భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. నియంత్రించడమా లేదా కఠిన నిబంధనలతో మినహాయింపులు ఇవ్వడమా అన్న ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆర్బీఐ కూడ క్రిప్టో కరెన్సీ పట్ల కఠినంగా ఉండాలని చెబుతోంది. ఇది దేశ ఆర్థిక భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి విధానం అనుసరిస్తుందన్న విషయంలో స్పష్టత వస్తుంది. క్రిప్టో కరెన్సీ పట్ల కేంద్రం కఠినంగా వ్యవహరించనుందన్న వార్తల నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలు భారీగా పతనం అవుతున్నాయి. బిట్ కాయిన్, ఎథెరియం, టెథర్ లు భారీగా పతనమయ్యాయి. బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా నేతృత్వంలో ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ భేటీలో క్రిప్టో ఎక్సేంచెజ్, బ్లాక్ చెయిన్, క్రిప్టో ఎస్సెట్స్ కౌన్సిల్ , ఇతరులు సమావేశం అయ్యారు. క్రిప్టోకరెన్సీని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం లేదని, వాటి మీద నియంత్రణ ఉంటే సరిపోతుందని ఈ భేటీలో ఓ నిర్ధారణకు వచ్చారు. ఇక క్రిప్టో కరెన్సీని పన్ను పరిధిలోకి తీసుకువచ్చి, లాభాలపై పన్నులు విధించడంపై కేంద్రం దృష్టి సారించబోతోందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
ReplyForward |