ధరల పతనం.. లబోదిబోమంటున్న రైతులు
1 min readపల్లెవెలుగువెబ్ : టమోట ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయి. మొన్నటి వరకు 30 కేజీల బాక్సు రూ.500 ఉండగా, శనివారం నాణ్యతను బట్టి రూ.100-200కు చేరింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. కనీసం కూలీల, రవాణా ఖర్చులు కూడా రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా టమోట సాగు భారీగా పెరగడమే ఇందుకు కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ములకలచెరువు మార్కెట్‌ను శనివారం టమోటాలు ముంచెత్తాయి. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఈ పంట సాగు భారీగా పెరగడంతో మార్కెట్‌కు భారీగా తెస్తున్నారు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా సరిహద్దు గ్రామాల నుంచి కూడా రైతులు టమోటాలను ఇక్కడికి తీసుకొస్తున్నా గిట్టుబాటు లేకపోవడంతో కుమిలిపోతున్నారు.