NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప‌డుతోన్న రూపాయి ..!

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మన దేశ కరెన్సీ సరికొత్త ఆల్‌టైం రికార్డు కనిష్ఠ స్థాయికి పతనమైంది. సోమవారం ఇంట్రాడే స్పాట్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం రేటు తొలిసారిగా 80కి చేరింది. చివరికి 16 పైసల నష్టంతో 79.98 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కె ట్లో ముడి చమురు ధరలు మళ్లీ కాస్త పెరగడంతో పాటు దేశీయ ఈక్విటీల్లోంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం ఇందుకు కారణమైందని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ శ్రీరామ్‌ అయ్యర్‌ తెలిపారు. గత శుక్రవారం డాలర్‌-రూపీ ఎక్స్ఛేంజ్‌ రేటు 80 సమీప స్థాయి నుంచి 17 పైసలు బలపడి 79.82 వద్ద ముగిసింది. అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సమీక్ష స్టేట్‌మెంట్‌ వచ్చే వారంలో విడుదల కానున్న నేపథ్యంలో మార్కెట్‌ వర్గాలు ముందుజాగ్రత్త ధోరణితో వ్యవహరించారని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసె్‌సలోని ఫారెక్స్‌ అనలిస్ట్‌ గౌరంగ్‌ సోమయ్య అన్నారు.

                                         

About Author