అసత్య ఆరోపణలతో బురద చల్లడం తగదు
1 min readతలపనూరు అంగన్‌వాడీ టీచర్ రామలక్ష్ముమ్మ..
పల్లెవెలుగు వెబ్ వీరపనాయినిపల్లి : తనపై గిట్టనివారు విలేఖరులకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో విషయం పేపర్లో ప్రచురితం అయిందని వీరపునాయునిపల్లె మండలంలోని తలపనూరు అంగన్‌వాడీ టీచర్ రామలక్ష్ముమ్మ అన్నారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తాను పిల్లలు లేకున్నా ఉన్నట్లు అటెండెన్స్ వేసుకుంటున్నాని అలాగే బాలింతలు, గర్భవతులకు ఇవ్వాల్సిన పోషకాలు ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేశారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని ఆరోపణలు చేసినవారు నిరూపించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రానికి సంబంధించిన ప్రతి ఒక్క రికార్డు పరిశీలించుకోవచ్చని ఎలాంటి చిన్న తప్పు ఉన్నట్లు నిరూపించినా ఉద్యోగానికి రాజీనామా చేస్తానన్నారు. ఇటీవల ఐదు రోజుల క్రితమే ఉన్నతాధికారులు తమ సెంటర్‌ను తనిఖీ చేశారని, గ్రామంలోని లబ్ధిదారులు, ప్రజల అభిప్రాయం కూడా సేకరించారని తాను తప్పు చేసి ఉంటే అధికారులే చర్యలు తీసుకునేవారన్నారు. గిట్టనివారు తప్పుడు ప్రచారం చేయడం తగదని హితవు పలికారు.