అసత్య ప్రచారాలను తిప్పి కొడతాం : ఈటల జమున
1 min readపల్లెవెలుగు వెబ్: తమ హాచరీస్, గోదాముల మీద ప్రభుత్వం చేస్తున్న అసత్య ఆరోపణలను తిప్పికొడతామని ఈటెల రాజేంద్ర సతీమణి జమున అన్నారు. తాము కష్టపడి ఎదిగామని, ఎవర్నీ మోసం చేయలేదని చెప్పారు. షామీర్ పేటలోని నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. మెదక్ జిల్లా మసాయిపేటలో 46 ఎకరాలు కొనుగోలు చేశామని, ఒక్క ఎకరం అక్రమంగా ఉన్న ముక్కు నేలకు రాస్తానని ఆమె అన్నారు. తప్పు అధికారుల వైపు ఉంటే… అధికారులు ముక్కు నేలకు రాస్తారా ? అంటూ సవాల్ విసిరారు. తమని ఆర్థికంగా దెబ్బతీయాలని కుట్రపన్నుతున్నారని ఆమె ఆరోపించారు.
ఉద్యమం కోసం సొంత డబ్బు ఖర్చు…
తెలంగాణ ఉద్యమం కోసం సొంత డబ్చు ఖర్చు చేశామని ఆమె చెప్పారు. కులరహిత సమాజం కావాలని కోరుకున్నాం. కానీ నేడు కులాలతో విభజిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య పాలనలో ఇలాంటి కులాల విభజన చూడలేదని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంత ఒత్తిడి చేసిన.. ఉద్యమం వదిలి వెళ్లలేదని అన్నారు.