తప్పుడు ప్రచారం మానుకోవాలి – హసన్ అలీ
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో తాను నకిలీ డాక్యుమెంట్లతో సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నానని వస్తున్న వార్తలను హసన్ అలీ సోమవారం విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు.సర్వే నెంబర్ 140-9,140-3 లో గల 69 సెంట్లు భూమి తనకు తన అమ్మమ్మ కాశింబి ద్వారా వారసత్వం హక్కుగా లభించిందని ఆయన అన్నారు. అయితే కొందరు దురుద్దేశపూర్వకంగా ఆ స్థలాన్ని ఆక్రమించుకోవాలని పోలీసుల ద్వారా కేసు నమోదు చేసి అక్రమించికోవాలని చూశారని అయితే అక్కడ తాము హక్కుగా వస్తున్న డాక్యుమెంట్లు చూసి పోలీసులు ఆ స్థలం హక్కుదారులం తామే అని నిర్ధారణ కావడంతో పోలీసులు సైతం తమ ప్రత్యర్థుల పిర్యాదు తీసుకోలేదన్నారు.అక్కడ వారి పథకం ఎదురు తిరగడంతో తిరిగి కోర్టు ద్వారా ఆ స్థలాన్ని పొందాలని దావా వేశారని అన్నారు.వాస్తవంగా తనకు సంబంధించిన ఆ ఆస్తి తన అనుభవంలో ఉన్నందున రెవెన్యూ అధికారులు తనకు ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారని, ఆ ఆస్తిని నేను నా కొడుకు సయ్యద్ హాజీ హస్సన్ కి దానంగా ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. సంబంధిత ఆస్తికి ఎలాంటి తప్పుడు పత్రాలు సృష్టించలేదని చెబుతూ అందుకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ లను విలేకరులకు అందజేశారు. అయితే ఇటీవల కాలంలో ప్రస్తుత స్థలానికి వాల్యూ రావడంతో ఉద్దేశపురకంగా తనను కోర్టు ద్వారా పోలీసులకు నోటీసులు ఇప్పించారని, తాము కూడా ఈ విషయంలో నంద్యాల కోట్లు దావా వేశామని ఆ దావా పెండింగ్లో ఉందని అన్నారు. అయితే ఎవరైనా ఈ విషయంలో తమ పట్ల తప్పుడు ప్రచారం చేస్తే వారి పట్ల చట్టరీత్యా చర్యలు తీసుకుంటారని ఆయన హెచ్చరించారు.