PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిరు పేదలందరి కోసం ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ..

1 min read

– పి.హెచ్.సి.లో 108 ,104 వాహనాలు బలోపేతం..
– జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి
పల్లెవెలుగు వెబ్ భీమవరం : బుధవారం తణుకు మండలం వేల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కొమరవరం గ్రామంలో గ్రామ సచివాలయంలో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ క్యాంపును జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ పేద ప్రజలు అందర్నీ సంపూర్ణ ఆరోగ్య వంతులుగా చేయడానికి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ప్రవేశ పెట్టడం జరిగిందని ఈ కార్య క్రమంలో వ్యాధిని గుర్తించడం గుర్తించిన వ్యాధిని తగ్గించేందుకు వివిధ రకాల వైద్య సేవలు అందించి మందులు ఇవ్వడం జరుగుతుందని కలెక్టరు తెలిపారు. పీహెచ్సీ లో ఉన్న ఇద్దరు డాక్టర్లు ప్రతి ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహించి ముందుగా వారికి ఏ విధమైన జబ్బులు ఉన్నాయో గుర్తించి వారికి అవసరమైన మందులు ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు. వైద్యం అందించడంతో పాటు వారం వారం వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని పరీక్షించడం జరుగుతుందని కలెక్టరు తెలిపారు. మీరు బాధపడే వ్యాధులతో మీ కుటుంబ సభ్యులు ఏవ్వరికీ వ్యాధి సోకకుండా వైద్య పరీక్షలు చేసి తగు ముందస్తు జాగ్రత్తలు తీసు కుంటా రని కలెక్టరు అన్నారు. ప్రభుత్వంలో విద్యా , ఆరోగ్యానికి అధిక ప్రాధా న్యత ఇవ్వడం జరుగుతుందని ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ప్రతి గ్రామాలలో డాక్టరు వైయస్సార్ ఆరోగ్య హెల్త్ క్లినిక్ లు నిర్మించడం జరిగిందన్నారు. పీహెచ్సీలు అన్ని వాడుకలోకి తీసుకురావడం 108 , 104 వాహనాలను బలోపేతం చేయడం ఆరోగ్యశ్రీ అమలు చేయడంతో పాటు ఆరోగ్య ఆసరా కూడా అందించడం జరుగుతుందని కలెక్టరు పి.ప్రశాంతి తెలిపారు. ఈ కార్యక్రమం పై వైద్య సిబ్బంది అవగాహన గ్రామాలలో అవగాహన శిబిరాలు నిర్వహించి ఎక్కువమంది ప్రజలు ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాములు వినియోగించుకునే విధంగా చూడా లని కలెక్టర్ వైద్యశాఖ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా డి. మహేశ్వరరావు,వైద్యాధికారులు డాక్టర్ కిషోర్ , డాక్టర్ హరిణి లు, తహశీల్దారు ప్రసాద్ , ఏఎన్ఎంలు, సచివాలయం సిబ్బంది, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

About Author