కుటుంబం సజీవదహనం.. ఎమ్మెల్యే కొడుకు పరారీ !
1 min read
పల్లెవెలుగువెబ్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాతపాల్వంచలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పాత పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్ సంచలనంగా మారింది. సూసైడ్ నోట్‌లో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడి పేరు వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేందర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పాల్వంచ ఎఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ప్రస్తుతం రాఘవేందర్ పరారీలో ఉన్నారని, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నామని తెలిపారు. సూసైడ్ లెటర్‌లో రామకృష్ణ తల్లి సూర్యవతి,అక్క మాధవీ పేర్లు కూడా ఉన్నాయనీ.. ఘటనపై పూర్తి విచారణ జరుగుతుందని ఎఎస్పీ తెలిపారు.