కుటుంబం మొత్తం ఆత్మహత్య..!
1 min read
పల్లెవెలుగు వెబ్: కీసరలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట్ కి చెందిన భిక్షపతి, ఉష దంపతులు కుటుంబ పోషణ కోసం కీసర పరిధిలోని నాగారం- వెస్ట్ గాంధీనగర్ వచ్చారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. భిక్షపతి పక్కింటిలోని ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు ఆరోపించారు. గురువారం రాత్రి భిక్షపతి మీద దాడిచేసి.. పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహిద్దామని చెప్పి వెళ్లిపోయారు. అవమానం భరించలేక భిక్షపతి.. తన భార్య, పిల్లలకు మొదట ఉరివేసి.. ఆతర్వాత తను కూడ ఉరివేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలి చేరుకుని.. కేసు నమోదు చేసి.. విచారణ చేస్తున్నారు.