నందికొట్కూరు ‘ఎంపీటీసీ’ లో ఫ్యాన్ హవా..
1 min readపల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు : కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ఎంపీటీసీ ఎన్నికల వైసీపీ ఘన విజయం సాధించింది. . భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికల కౌంటింగ్ నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు సంబంధించి ఎంపీటీసీ స్థానాలు మొత్తం 65 ఉండగా అందులో 55 వైసీపీ విజయఢంకా మోగించింది. 5 టీడీపీ, ఒకటి బీజేపీ, 4 స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ఎంపీటీసీ విజేతల వివరాలిలా ఉన్నాయి.
నందికొట్కూరు నియోజకవర్గంలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు : 65
వైసిపి మొత్తం గెలిచిన స్థానాలు : 55
టీడీపీ మొత్తం గెలిచిన స్థానాలు : 05
బీజేపీ మొత్తం గెలిచిన స్థానాలు :01
స్వతంత్ర అభ్యర్ధులు : 04
నందికొట్కూరు మండలం
ఎంపీటీసీ స్థానాలు -11
వైసిపి : 7 స్థానాల్లో గెలుపు
టిడిపి : 4 స్థానాల్లో గెలుపు
పగిడ్యాల మండలం ఎంపీటీసీ స్థానాలు -10
వైసీపీ : 8 స్థానాల్లో గెలుపు
టిడిపి : ఒక స్థానంలో గెలుపు
బిజెపి : ఒక స్థానంలో గెలుపు
మిడుతూరు : ఎంపిటిసి స్థానాలు 12…
వైసీపీ : 12 స్థానాలలో గెలుపు…
పాములపాడు మండలం ఎంపిటిసి స్థానాలు 12
వైసిపి : 11 స్థానాలలో గెలుపు
టీడీపీ : 0
స్వతంత్ర అభ్యర్థి : 1
జూపాడుబంగ్లా మండలం ఎంపిటిసి స్థానాలు : 11
వైసిపి : 8
టిడిపి : 0
స్వతంత్ర అభ్యర్థి : 3
కొత్తపల్లి మండలం ఎంపిటిసి స్థానాలు : 9
వైసీపీ : 9
టిడిపి : 0