కర్నూలులో ఫ్యాన్..హవా..
1 min readఎమ్మెల్యే ఏంఏ హఫీజ్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సహకారంతో గెలుపు ధీమా…
- ఇంటింటికి వెళ్లి.. విస్తృత ప్రచారం..
- నగరాభివృద్ధికి కృషి చేస్తా…
- ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తా…
- సంక్షేమం.. అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తా…
- కలెక్టర్‌గా సేవ చేశా….
- ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వండి…
- వైసీపీ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ అహ్మద్
సార్వత్రిక ఎన్నికల కోడ్ నేడో…రేపో..రానున్న నేపథ్యంలో టీడీపీ.. వైసీపీ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ కొత్త వారికి టిక్కెట్ ఖరారు చేయగా… మరికొన్ని నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. టిక్కెట్ కోసం ఎదురు చూస్తున్న ఆశావహులు, టిక్కెట్ వచ్చినా తక్కువ సమయం ఉందని అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. ఈ కోవకు చెందిన వారిలో కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ అహ్మద్ కూడా ఉన్నారు. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సహకారంతో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పల్లెవెలుగు, కర్నూలు:కర్నూలు నగరంలో ఫ్యాన్ హవా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంతోపాటు నగరాన్ని స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దుతానని స్పష్టమైన హామీ ఇస్తున్న వైసీపీ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ అహ్మద్ ప్రచారంలో జోరందుకున్నారు. ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సహకారంతో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు.
జోష్..ఫుల్…:
విద్యావంతుడు..మేధావి…కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఇంతియాజ్ అహ్మద్.. ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని, ఇందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరుతున్నాడు. ఇప్పటికే నగరంలోని కొన్ని వార్డుల్లో పర్యటించిన ఆయనకు.. ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో కార్యకర్తలు, నాయకులు జోష్‌లో ఉన్నారు.
సేవ కోసమే… వచ్చా…:
నగరవాసులకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొంటున్న ఇంతియాజ్ అహ్మద్… అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానన్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, ఇది గుర్తించుకొని ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు. రోడ్లు, కాల్వలు, వీధిలైట్లు తదితర సమస్యలన్నీ పరిష్కరిస్తానని… సంక్షేమం.. అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానన్నారు.
వారిపైనే… నమ్మకం….:
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై నమ్మకంతో …కర్నూలు అభ్యర్థిగా నిలబెట్టారని పేర్కొన్న ఇంతియాజ్ అహ్మద్… తనను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి అప్పగించారని స్పష్టం చేశారు. ఇప్పటికే వారిద్దరితో కలిసి ప్రతి సమావేశంలోనూ.. కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ… విస్తృత ప్రచారం చేస్తున్నారు.
ముస్లిం ఓట్లే… కీలకం..:
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన కర్నూలులో అభ్యర్థి గెలుపు ఓటములను నిర్ధారించడంలో ముస్లింల పాత్ర కీలకం. కానీ తనను అన్ని వర్గాల వారు ఆదరిస్తున్నారని, ఇందుకు ప్రచారంలో వస్తున్న స్పందనే నిదర్శనమన్నారు. ఏ వార్డుకు వెళ్లినా… సీఎం వై ఎస్ జగనన్న మనిషి వచ్చాడంటూ… ఆదరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
సీఎం జగన్‌కు… గిఫ్ట్..:
రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో వైసీపీ జెండా ఎగరవేసి… సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్‌గా ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ అహ్మద్. ప్రభుత్వ పథకాలు అందకపోయినా…. ఏమైనా సమస్యలు ఉన్నా తనను ఎప్పడైనా సంప్రదించవచ్చని వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు బలంగా ఉన్న కర్నూలులో తాను సునాయాసంగా గెలుపొందుతానని ఇంతియాజ్ అహ్మద్ చెప్పుకొచ్చారు.