బుట్టా ఫౌండషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి ఫ్యాన్స్, బెడ్ షిట్స్ అందజేత
1 min readఆసుపత్రి అభ్యున్నతికి కృషి చేస్తాం ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, ఎమ్మిగనూరు సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యలు పలు సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారు. ఇందులో భాగంగానే ఆసుపత్రికి బుట్ట ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికు ఫ్యాన్స్, బెడ్ షీట్స్ అందజేసినట్లు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి , ఎమ్మిగనూరు సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం వైద్య సిబ్బందికి అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరు ఆసుపత్రిలో రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాన్నారు. సీఎం జగనన్న ప్రభుత్వ హయాంలోనే ఎమ్మిగనూరు వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి నిధులు కేటాయించిరని, ప్రస్తుతం వంద పడకల ఆసుపత్రి నిర్మాణం ముగింపు దశకు వచ్చిందన్నారు. పేద ప్రజలు సేవా కార్యక్రమాలు చేస్తున్న బుట్టా ఫౌండషన్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుట్టా నీలకంఠప్ప, డాక్టర్లు, నాయకులు, కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.