NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

25న ఫ్యాప్టో జిల్లా సదస్సు

1 min read

పల్లెవెలుగు: ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యల పై ఫ్యాప్టో చేపట్టిన నిరసన కార్యక్రమం లో భాగంగా కర్నూల్ జిల్లా యందు జూన్ 25 ఆదివారం ఉదయం 9 గంటలకు కర్నూల్ జిల్లా పరిషత్ మీటింగ్ హల్ నందు విద్యా సదస్సు నిర్వహించబడుతుంది. ఈ సదస్సు కు ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు మరియు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు హాజరు అవుతారు.కావున కర్నూలు జిల్లాలోని ఉపాధ్యాయ, ఉద్యోగులందరు సదస్సు కి హాజరు కావాలని ఫ్యాప్టో కర్నూలు జిల్లా నాయకులు సంయుక్తంగా పిలుపుఇచ్చారు.ఇందులో భాగంగా ఎస్ టి యు జిల్లా కార్యాలయం నందు ఫ్యాప్టో యొక్క  కార్యాచరణ మరియు డిమాండ్స్ సంబంధించిన కరపత్రం ను విడుదల చేయడం జరిగింది. ఈ కార్య క్రమం కు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఫ్యాప్టో కో చైర్మన్ ప్రకాష్ రావు హాజరు అయ్యారు. కర్నూలు జిల్లా నలుమూలల నుండి అత్యధిక సంఖ్యలో ఉపాద్యాయులు జూన్ 25 న జరిగే విద్యా సదస్సు కి హాజరు అయ్యి ఫ్యాప్టో కార్య చరణను విజయవంతం చేయాలని కోరారు. కర్నూల్ జిల్లా ఫ్యాప్టో ఛైర్మెన్ గొకారి మరియు గట్టు తిమ్మప్ప గారు ఫ్యాప్టో సభ్య సంఘాల నాయకులు మరియు కార్యకర్తలు సమిష్టి గ కృషి చేసి సదస్సు ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో కోశాధికారి సేవాలాల్ నాయక్ , రంగన్న APTF 257 ,జయరాజు మరియు సుధాకర్ UTF,నారాయణ HMA, మరియనందం APTF 1938, శేఖర్ మరియు  నాగరాజు STU, కిషోర్ DTF- వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

About Author