PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు జిల్లా విద్యాధికారి కార్యాలయం ముందు ఫ్యాప్టొ నిరసన

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నేటి సాయంత్రం 5 గంటలకు కర్నూలు జిల్లా విద్యాధికారి కార్యాలయం ముందు ఫ్యాప్టొ అదర్వ్యం లో నిరసన ప్రదర్శన జరిగింది.ఈ కార్యక్రమము ముఖ్య అతిథులుగా ఫ్యాప్టొ రాష్ట్ర కో చైర్మన్ ప్రకాష్ రావు, రాష్ట్ర కార్యవర్గం సభ్యులు జి హృదయ రాజు మరియు తిమ్మన్న  హాజరు అయ్యారు.ఈ కార్యక్రమం నకు జిల్లా చైర్మన్ గోకారి  అధ్యక్షత వహించారు.నిరసన ప్రదర్శనలో ప్రకాష్ రావు  మాట్లడుతూ రాష్ట్రం లో 60 వేల మంది కి పైగా జీతాలు ఇవ్వలేక పోవడం అనేది అధికారుల నిర్లక్ష్య వైఖరి కి నిదర్శనం అని దీనిని ఫ్యా ప్టొ తీవ్రంగా ఖండిస్తునట్లు చెప్పారు. రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు హృదయ రాజు  మాట్లడుతూ రేషనైజేషన్ మరియు బదలీ లు జరగి రెండు నెలలు గడవక ముందే శాస్త్రీయత లేకుండా రేషనైజేషన్ మరల చేయడానికి ప్రయత్నించడం టీచర్లను వేధించడం కొరకు మాత్రమే అని అన్నారు. రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు తిమ్మన్న  మట్లాడుతూ విద్యా శాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గారు పాఠశాల సందర్శన పేరు తో టీచర్ల ను వేధిస్తున్నారు.రాత్రి వేళల్లో ఇండ్లకు వెళ్లటం, వీడియో కాల్ చేస్తూ  అధికారులను టీచర్లను తన దగ్గరకు రమ్మని పిలవటం దారుణం .దీన్ని అయన మార్చుకోవాలి అని చెప్పారు జిల్లా సెక్రెటరీ జనరల్ తిమ్మప్ప ఈ సమస్య లకు కారణం అయిన ప్రభుత్వం ఉత్తర్వులు 117 ను వెంటనే రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో యు టి ఎఫ్ రాష్ర్ట సహాయ అధ్యక్షుడు  సురేష్ విద్యా శాఖ లో జరగుతున్న గందగోళానికి నిరసన గా రాష్ర్ట విద్యా శాఖ కార్యలయం ముందు ఈ నెల 23 తేది 12 గంటల నిరసన కార్యక్రమము వుంది దానికి కర్నూలు జిల్లా నుండి వేలాది గా టీచర్లు తరలి రావాలని పిలపునిచ్చారు. యు టి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు జయరాజు, రవి కుమార్, కాంతా రావు , నవీన్ పాటిల్ ఏస్ టి యు జిల్లా ప్రథాన కార్యదర్శి జనార్ధన్, పాలయ్య, నాగరాజు ఏ పి టి ఎఫ్ 1938 జిల్లా అధ్యక్షుడు ఇస్మాయిల్, మరియానందము ఏ పి టి ఎఫ్ 257 నుండి రంగన్న డి టి ఎఫ్ సీనియర్ నాయకుడు రత్నం ఏసేపు, బి టి ఎ నా యకుడు సుధాకర్ ఆప్టా జిల్లా అధ్యక్షుడు రాజసాగర్, సేవా నాయక్, రఫీ , అహ్మద్ భాషా మరియు సభ్య సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

About Author