నల్ల బ్యాడ్జీలు ధరించి FAPTO నిరసన
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్ర FAPTO ఇచ్చిన పిలుపు మేరకు నేడు 25 వ తేదీ ఉదయం 8.00 గంటల నుండి 10.00 గంటల వరకు SSC SPOT కేంద్రం వద్ద జిల్లా FAPTO ఆద్వర్యంలో ఉపాధ్యాయులకు,అధికారులకు నల్ల బ్యాడ్జీ ల పంపిణీ మరియు జిల్లా FAPTO నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది .సుమారు 1000 మంది ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి మూల్యాంకన కేంద్రానికి హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఫ్యాప్టో చైర్మన్ ఎస్ గోకారి ,HMA రాష్ట్ర అధ్యక్షుడు ఓంకార్ యాదవ్,డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఐ. మరియానందం కోశాధికారి ఆర్. సేవాలాల్ నాయక్ ఫ్యాప్టో సభ్యసంఘ నాయకులు నవీన్ పటేల్ ,రవికుమార్ ,మద్దిలేటి, వెంకటరాముడు, గఫార్, శేఖర్, ఇస్మాయిల్ ,రామచంద్రుడు, హనుమంతు, మురళి, రఘు, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
