ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగి పోతుల వేణుగోపాలరావు కి వీడ్కోలసభ ఏర్పాటు
1 min read
38 సంవత్సరాలుగా సేవలు, డిప్యూటీ సూపరీoడెండెంట్
(పిడి ఇంచార్జ్)గా పదవీ విరమణ
ఆయన చేసిన సేవలను కొనియాడిన పలువురు ఆర్టీసీ అధికారులు,సహా ఉద్యోగులు, శ్రేయోభిలాషులు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏపీఎస్ఆర్టీసీ లో గత38 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో విధి నిర్వహణతో అంకితభావంతో విధులు నిర్వహించి, ఉన్నతాధికారుల మరియు సహ ఉద్యోగుల మన్నలు పొంది డిస్టిక్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్, ఏలూరు జిల్లా, ఏలూరు నందు డిప్యూటీ సూపరిoడెండెంట్-పి(పిడి ఇన్చార్జి)గా ఈనెల 31వ తేదీ పదవి వివరణ చేయుచున్న పోతుల వేణుగోపాలరావు (వేణు) పదవీ విరమణ,వీడ్కోలసభ డిపిటిఓ కార్యాలయావరణలో పోతుల వేణుగోపాలరావు కి ఏలూరు ఆర్టీసీ అధికారులు, సహ ఉద్యోగులు,బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు శాలువాలు కప్పి, పూలబొకెలు అందించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈయనకు భార్య, కుమారుడు,కుమార్తె ఉన్నారు. గడచిన 38 సంవత్సరాల కాలంలో ఆయన సమర్థవంతంగా వివిధ హోదాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ తన కుటుంబాన్ని పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని తన కుమారుడిని, కుమార్తెను ఉన్నత విద్యా భ్యాసవంతులుగా తీర్చిదిద్ది వారి భవిష్యత్తుకు బాటలు వేశారు. ఆయన ఆర్టీసీకి అందించిన సేవలను ఏలూరు డిపిటిఓ ఎన్.వరప్రసాద్,బడేటి వెంకట్రామయ్య (బడేటి) డిపో మేనేజర్ బి.వాణి, పిఆర్ఓ కె.ఎల్.వి నరసింహం సహచర ఉద్యోగులు, కార్యాలయ సిబ్బంది కొనియాడారు.
