బదిలీపై వెళుతున్న జేసి, ఎస్పీకి ఆత్మీయ వీడ్కోలు..
1 min read– విధి నిర్వహణలో తమదైన ముద్ర వేసుకున్నారు..
– జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : నిబద్ధత జవాబుదారితనం పనిచేస్తే ఉన్నత శిఖరాలు అందుకోవడం సులభమని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు, జిల్లా కలెక్టర్ గా పదోన్నతి పై వెళుతున్న జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు మరియు బదిలీపై వెళుతున్న ఎస్పి రాహుల్ దేవ్ శర్మ కి మంగళవారం రాత్రి స్థానిక చలసాని గార్డెన్స్ లో ఏర్పాటుచేసిన ఆత్మీయ వీడ్కోలు సభలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు లు తమ విధి నిర్వహణలో తనదైన ముద్ర వేసుకున్నారన్నరు. జిల్లాలో వరదల సమయంలో సహాయ పునరావాస కార్యక్రమాల అమలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాల సమయంలో ఈ ఇరువురు అధికారులు సమర్ధవంతమైన పనితీరుని కనపరచి, జిల్లా యంత్రా0గానికి మంచి పేరు తీసుకువచ్చారన్నరు. అనంతరం పి. అరుణ్ బాబు, రాహుల్ దేవ్ శర్మలను జిల్లా అధికారులు , పలు ఉద్యోగ సంఘాల నాయకులు దుశ్శాలువా, మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అరుణ్ బాబు, రాహుల్ దేవ్ శర్మలు తమకు జరిగిన సన్మానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, జిల్లాలో మంచి టీం స్పిరిట్ ఉన్న ఉద్యోగులు ఉన్నారని, తమ విధి నిర్వహణలో తమకు ఎంతో సహకారం, తోడ్పాటు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి లావణ్య వేణి, అడిషనల్ ఎస్పీ ఎన్.సూర్యచంద్ర రావు,డిఆర్ఓ ఏవిఎన్ఎస్ మూర్తి, నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డి ఎఫ్ ఓ రవీంద్ర దామా, జడ్పీ సీఈవో కె. రవికుమార్, డి ఆర్ డి ఏ పిడి కె విజయరాజు, వ్యవసాయ శాఖ అధికారి వై. రామకృష్ణ, ఏడి వై సుబ్బారావు, జిల్లా పంచాయతీ అధికారి జి.వి.మల్లికార్జున రావు ,ఆర్డీవోలు కె పెంచల కిషోర్, ఝాన్సీ రాణి పంచాయతీరాజ్ ఎస్సీ భాస్కర్ రెడ్డి ,ఇరిగేషన్ శాఖ ఎస్సీ శ్రీనివాసరావు ,డ్వామా పిడి పి. రాము,డి ఎస్ వో రాజు, జిల్లా మేనేజర్ మంజు భార్గవి, ఐ సి డి ఎస్ పి డి పద్మావతి, సర్వే ఏడి వెంకటేశ్వరరావు, జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారి పి. ఏసుదాసు డి.ఎస్.పి పైడేశ్వరరావు,ఎన్ జి వో జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు, కప్పప్పల సత్యనారాయణ, భూపతిరాజు, ఏపీ జెఎసి జిల్లా అధ్యక్షులు కె రమేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి శ్రీనివాస్ , పలు మండలాల తాసిల్దార్లు ఎంపీడీవోలు పాల్గొన్నారు.