PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులకు పొలం నీళ్లే గతి..

1 min read

– పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి 

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలం చింతలపల్లి గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు పొలం నుంచి వచ్చే నీళ్లే  విద్యార్థులకు త్రాగునీళ్లుగా మారాయి.ఇదే పాఠశాలలో 70 మంది విద్యార్థులు చదువుతున్నారు.  శుక్రవారం మధ్యాహ్నం పాఠశాలలో భోజనం చేసిన తర్వాత రోడ్డు పక్కన ఉన్న వంక దగ్గర పై సుదూర పొలాల నుంచి వచ్చే వర్షం నీళ్లు వంక దగ్గర నిల్వ ఉంటున్నాయి.భోజనం చేసిన తర్వాత విద్యార్థులు ఇక్కడే వంక దగ్గర ప్లేట్లు కడుక్కొని ఈ నీళ్లే త్రాగుతూ ఉండడం విశేషం.విద్యార్థులు బయటకు వెళ్లి ఏ నీళ్లు తాగుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా చూసుకో లేకపోతే ఎలా అంటూ తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు మురికి నీరు త్రాగడం వల్ల విద్యార్థులకు ఏమైనా ప్రాణహాని జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని పాఠశాల సిబ్బందిపై తల్లి దండ్రులు మండిపడుతున్నారు.నిర్లక్ష్యం వహించిన పాఠశాల సిబ్బందిపై జిల్లా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

About Author