NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య… ఎమ్మెల్యే పరామర్శ

1 min read

– అప్పుల బాధ భరించలేక రైలు కింద పడి  ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీదేవమ్మ. 

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: తుగ్గలి మండల పరిధిలోనీ కడమకుంట్ల గ్రామానికి చెందిన  కురువ రామచంద్ర (33) అనే రైతు అప్పుల బాధ భరించ లేక రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ రైతు కుటుంబాన్ని మంగళవారము ఎమ్మెల్యే శ్రీదేవమ్మ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అప్పులు ఎక్కువ కావడంతో ఎవరు ఆత్మహత్యలకు  పాల్పడవద్దని అన్నారు. కడమ కుంట్ల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కురువ రామచంద్ర కుటుంబానికి తాము అండగా ఉంటామని తెలిపారు .ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం త్వరగా అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు అమర్నాథ్ రెడ్డి, మాజీ సర్పంచ్ సునిత ,మాజీ ఎంపీటీసీ రామాంజనేయులు, ఎంపీటీసీ మెంబర్ ఆవుల ఆదిలక్ష్మి ,ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్, వైసిపి నాయకులు హుస్సేనాపురం కమల్ భాష, సత్తార్, హుస్సేన్ పీరా, పంచాయతీ కార్యదర్శి గోపాల్, వీఆర్వో కిరణ్, సచివాలయ వ్యవసాయ కార్యదర్శి మనోజ్ఞ,  తదితరులు పాల్గొన్నారు.

About Author