బీజేపీ వ్యతిరేక పార్టీకి రైతు ఉద్యమ నేత మద్దతు !
1 min readపల్లెవెలుగువెబ్ : రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి మద్దతు తెలిపారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా నిరవధికంగా జరిగిన రైతుల ఉద్యమంలో రాకేశ్ టికాయత్ కీలక పాత్ర పోషించారు. అంతే కాకుండా భారతీయ జనతా పార్టీని ఓడించాలని ప్రచారం కూడా చేశారు.సాగు చట్టాలను మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నప్పటికీ తమ ఉద్యమం ఆపబోమని, ప్రభుత్వం చేయాల్సినవి ఇంకా ఉన్నాయని టికాయత్ చెప్తూ వస్తున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని చెప్పారు.