NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతుల ఉత్పత్తిదారుల సంఘాలు అన్ని విధాల బలోపేతం కావాలి 

1 min read

ఉమ్మడి జిల్లాల నాబార్డ్ డి డి ఎం. ఎం సుబ్బారెడ్డి 

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : ఉమ్మడి జిల్లాల్లోని రైతుల ఉత్పత్తి దారుల సంఘాలు అన్ని విధాల బలో పేతం కావాలని  నాబార్డ్ డీడియం.ఎం సుబ్బారెడ్డి ఆకాంక్షించారు. గడివేములలో నాబార్డ్ వారి ఆర్థిక సహాయం తో ఏర్పాటు చేసిన రైతుల ఉత్పత్తి దారుల సంఘం కార్యాలయాన్ని సోమవారం ఉమ్మడి జిల్లా నాబార్డ్ DDM యం.సుబ్బారెడ్డి మరియు JSW, CSR హెడ్  జి.రవికుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతుల ఉత్పత్తిదారుల సంఘాల్లో మధ్య దళారీ వ్యవస్థను రూపుమాపాలన్నారు. రైతుల ఉత్పత్తి దారుల సంఘాలు సంఘటితంగా మెలిగినట్లయితే  ఆర్థికంగా పరిపుష్టమై ఎన్నో విజయాలు సాధించవచ్చని వారు స్పష్టం చేశారు. ఇందులో రైతులందరూ భాగస్వాములు కావాలని కోరారు. నవ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో యేర్పాటు చేసిన  రైతు ఉత్పత్తి దారుల సంఘం యొక్క పని తీరు మరియు రికార్డుల నిర్వహణ గురించి CEO రవిచంద్ర ఆచారి ఇక్కడ హాజరైన  అధికారులకు వివరించారు. అలాగే 3 సంవత్సరాల వరకు FPO అభివృద్ధి కొరకు JSW దోహదపడుతుందని, ఆఫీసు నిర్వహణ, ఫర్నీచర్ మరియు కామన్ ఫెసిలిటీ సెంటర్ యేర్పాటు గురించి అధికారులకు వారుతెలిపారు. వ్యవసాయ శాఖ పరంగా రైతు సంఘానికి అవసరమైన లైసెన్సులు అందజేస్తామని మండల వ్యవసాయధికారి హేమసుందర్ రెడ్డి అన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ పావని ఈ సందర్భంగా సూచించారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం లో APGB మేనేజర్ ఆర్. వింజిల్ జాన్ మరియు PACS CEO సి. ఆదినారాయణ పాల్గొని రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతానికి అవసరమయ్యే పలు సూచనలు చేశారు. ఈ  కార్యక్రమం లో నవ యూత్ అసోసియేషన్ డైరెక్టర్ యు. నరసింహులు మరియు రైతు ఉత్పత్తి ఉత్పత్తిదారులు పాల్గొన్నారు.

About Author